NTV Telugu Site icon

Narayana Swamy: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

Narayana Swamy On Cbn

Narayana Swamy On Cbn

Narayana Swamy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇన్నాళ్లు చంద్రబాబు కోర్టులను మేనేజ్‌ చేస్తూ వచ్చారు.. ఇప్పుడు కంటి పరీక్ష కోసం చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. అయితే, కంటి పరీక్షల తర్వాత మళ్లీ చంద్రబాబు జైలుకే అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ రోజు కంటి పరీక్షలు అన్నారు.. రేపు హార్ట్ ఎటాక్ అంటారు.. మళ్లీ కిడ్నీ సమస్య అంటారు.. ఆ తర్వాత దేశంలోని ఉన్న అన్ని రోగాలు ఉన్నాయని చెబుతూ బెయిల్ కోసం డ్రామాలు ఆడతారు అని సంచలన ఆరోపణలు చేశారు. మరి కళ్లు, లివర్‌, హార్ట్‌ పనిచేయకుండా ఉండేవారు ఎలా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు? అని ప్రశ్నించారు.

Read Also: MLA Lakshmareddy: గ్రామాల రూపురేఖలు మార్చాం.. ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఇక, హమాస్ ఉగ్రవాదుల్లా టీడీపీ నేతలు ఆలోచిస్తూన్నారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో నిజం గెలవాలనే భువనేశ్వరి.. ముందుగా నారా చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని గ్రహించాలని సూచించారు.. చంద్రబాబు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు నిజామా? కాదా? అనేది భువనేశ్వరి చెప్పాలని డిమాండ్‌ చేశారు.. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, అనారోగ్య సమస్యలతో హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో.. మంగళవారం రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు రిలీజైన విషయం విదితమే..