NTV Telugu Site icon

Narayana Swamy: ఎస్పీకి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం

Deputy Cm Narayanaswamy

Deputy Cm Narayanaswamy

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యంతో టీడీపీ ప్రలోభాలకు తెర లేపినా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారంటూ మండిపడ్డారు. సుమారు 300 మంది బౌన్సర్లతో టీడీపీ అభ్యర్థి బూత్‌లలో హల్చల్ చేసినా, రౌడీయిజం చేసినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ… ‘గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోలింగ్ సరిగ్గా జరగలేదు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యంతో టీడీపీ ప్రలోభాలకు తెర లేపినా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. అడ్డుకోవాల్సిన స్థానిక పోలీసులేమో మళ్లీ మీ ప్రభుత్వం వస్తే దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారాలను డిప్యూటీ సీఎం అయిన నేను స్వయంగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు’ అని అన్నారు.

Also Read: Somireddy Chandra Mohan Reddy: 13వ తేదీ అయిపోయింది.. జూన్ 4వ తేదీ మిగిలే ఉంది!

‘ఓటర్లను ప్రలోభ పెట్టడానికి టీడీపీ అభ్యర్థి రూ. 500లను ముద్రించిన ఏటియం కార్డులను పంపిణీ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఆ ఏటియం కార్డులను పట్టుకొని ప్రజలు ఎవర్ని అడగాలో తెలియకుండా తిరుగితున్నారు. చంద్రబాబు నాయుడు ఇదే తరహా మోసం గతంలో సత్యవేడు నియోజకవర్గంలో చేసి నన్ను ఓడించాడు. చంద్రబాబు ఓ అమ్మ, అబ్బకు పుట్టి ఉంటే.. అమాయక ప్రజలను మోసం చేయకుండా ఆ ఏటియం కార్డులకు డబ్బులు ఇవ్వాలి’ అని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.