Site icon NTV Telugu

Ap Deputy Cm Amjad Basha: సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం

Amjad Basha

Amjad Basha

Ap Deputy Cm Amjad Basha: సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే సాధ్యమని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరిగిన మేలు వివరించేందుకే బస్సు యాత్ర చేపట్టామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వెనుకబడిన వర్గాలను విస్మరించారన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కులవృత్తులకే పరిమితం కావాలని చంద్రబాబు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఐఏఎస్ , ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో వెనుకబడిన వర్గాల వారు ఉండాలని జగన్ ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తామన్నారు. జగన్ పాలనతో టీడీపీ కంచుకోటలు బద్ధలవుతాయని ఆయన అన్నారు.

Also Read: Visakhapatnam: 101 సంవత్సరాల వయసులో 3 స్వర్ణ పథకాలను సాధించిన విశాఖ వాసి..

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణను ఓడించాలన్నారు.

Exit mobile version