Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్‌పై వివిధ శాఖల సెక్రెటరీలు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22, 23 తేదీలలో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ కావడంతో ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో 5500కు పైగా డ్రోన్లను వినియోగించనున్నారు. డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లను స్పెషల్ చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. 14 రకాల థీమ్స్‌తో డ్రోన్ సమ్మిట్‌ను అమరావతిలో నిర్వహించనున్నారు.
Read Also: DGP Dwaraka Tirumala Rao: అక్టోబర్ 21 నుండి 31 వరకు సంస్మరణ దినోత్సవాలు