NTV Telugu Site icon

CS Neerabh Kumar Prasad: సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సీఎస్ నీరబ్ సమీక్ష

Andhra Pradesh

Andhra Pradesh

CS Neerabh Kumar Prasad: సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రధాని సహా చాలా మంది వీఐపీలు వస్తున్నందున్న ఎలాంటి లోటుపాట్లు జరగ్గకుండా చూడాలని సీఎస్ నీరబ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read Also: Modi swearing: రేపే మోడీ ప్రమాణస్వీకారం.. విపక్షాలకు అందని ఆహ్వానాలు

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం ఐదుగురు ఐఏఎస్‌ల బృందాన్ని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) నియమించింది. బృందంలో సభ్యులుగా ఐఏఎస్‌ అధికారులు బాబు.ఏ, హరి జవహర్ లాల్, కన్నబాబు, సీహెచ్ హరికిరణ్, వీర ప్యాండన్‌లు ఉన్నారు. తదుపరి ఆదేశాల కోసం జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఎదుట ఐదుగురు ఐఏఎస్‌లు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.