Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cs Jawahar Reddy Review On Election Preparations In Secretariat

CS Review on Elections: ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష.

Published Date :January 22, 2024 , 4:46 pm
By Mahesh Jakki
CS Review on Elections: ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష.
  • Follow Us :
  • google news
  • dailyhunt

CS Review on Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష చేపట్టారు. బదిలీల అనంతరం వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన సుమారు 2 వేల మందిని బదిలీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైనా సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. సీఎస్‌తో సమీక్షకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు హాజరయ్యారు.

Read Also: Andhrapradesh: జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల

సీఈసీ ఆదేశాలకు అనుగుణంగా రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లాల్లో వచ్చే జూన్ నాటికి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులను ఈనెల 25లోగా తప్పని సరిగా బదిలీ చేయాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాల్సిన ర్యాంపులు వంటి సౌకర్యాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా, తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతో పాటు పటిష్ట నిఘాకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటును తక్షణం పూర్తి చేయాలని సీఎస్  పోలీస్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులను ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ..  ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాల్సిన వారిని గుర్తించగా.. ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, పోలీస్ శాఖల్లో బదిలీ చేయాల్సిన వారిని గుర్తించగా..  మూడు రోజుల్లో వారిని బదిలీ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సీఈవో మీనా సూచించారు.  ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ,  శాంతి భద్రతల అదనపు డీజీపీ  ఎస్.బాగ్చి, సీడీఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్, ఐజీ రవీంద్ర బాబు, అదనపు సీఇవో కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిషాంతి,  తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Elections 2024
  • andhrapradesh
  • AP CS Jawahar Reddy
  • AP Elections 2024
  • election preparations

తాజావార్తలు

  • Story Board: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా.. ఇండియాలో తప్పని కష్టాలు.. యుద్ధం అందర్నీ ముంచేస్తోందా..?

  • 627 కిలోమీటర్ల రేంజ్‌.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?

  • Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions