Site icon NTV Telugu

CS Meeting: జనవరిలో ఢిల్లీలో సీఎస్‌ల భేటీ.. ఏపీ సీఎస్ సమీక్ష

Apcs

Apcs

ఢిల్లీలో జనవరిలో రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. సీఎస్ ల సమావేశంపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీ సచివాలయం నుంచి వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, సంబంధిత శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు. జనవరి మొదటి వారంలో జరగనున్న 2వ జాతీయ స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఏం చర్చించాలనేది ఎజెండా రూపొందించనున్నారు.

Read Also:Encounter: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు నక్సల్స్ మృతి

సమావేశానికి సంబంధించిన వివిధ అంశాలపై వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, పీఎం ముఖ్య కార్యదర్శి డా.పి కె.మిశ్రా వీసీ చర్చించారు. జనవరి 5 నుండి 7వ తేదీ వరకు జాతీయ స్థాయిలో సిఎస్ ల సమావేశం జరగనుంది. వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ అంశాలపై సిఎస్ లు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ. ఇన్నోవేటివ్ విధానాలతో రావాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు రాజీవ్ గౌబ.

Read Also: TS SET : టీఎస్ సెట్ నోటిఫికేషన్ విడుదల

Exit mobile version