NTV Telugu Site icon

AP CS Jawahar Reddy: విభజన అంశాలపై రేపు ఢిల్లీలో భేటీ

Jawahar Reddy

Jawahar Reddy

ఏపీ, తెలంగాణకు సంబంధించి అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉండిపోయాయి. విభజన సమస్యలపై కేంద్రంతో గతంలో చర్చలు జరిగాయి.కొన్ని అంశాల్లో కొన్ని ఆర్డర్లు ఇచ్చాయి.తెలంగాణ ఏపీకి ఇవ్వాల్సిన జెన్కో బకాయిలపై కేంద్రం ఆదేశాలిచ్చింది.దీనిపై తెలంగాణ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది.. అది వేకెట్ అయింది.ఢిల్లీలో వివిధ అంశాలపై కొంత క్లారిటీ తేవడానికి ప్రయత్నించాం.మార్చి నెలాఖరులోగా వివిధ సమస్యల పరిష్కారం వస్తుందని భావించాం అన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.

Read Also:Sri Lanka vs Ireland: శ్రీలంక అతి భారీ విజయం.. గత రికార్డ్ బద్దలు

మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నాం.. కేంద్ర అధికారులతో చర్చలు జరుపుతాం.ఆ చర్చలు జరుగుతున్న సందర్భంలో సీఎం కూడా హాజరు కావాల్సివ పరిస్థితి ఉండే అవకాశం ఉంది.మా సూచన మేరకు సీఎం వ్యక్తిగత పర్యటన వేసుకున్నారు.మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది కాబట్టే ఈ సమాచారాన్ని తెలుపుతున్నాం.వివిధ సందర్భాల్లో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.దానిపై క్లారిటీ ఇస్తున్నాం.రెవెన్యూ డెఫిసిట్.. పోలవరం అంశాలపై చర్చలు జరుపుతున్నాం.రేపు మేం ఢిల్లీ వెళ్తున్నాం.అవసరమైతే సీఎం జగన్ ఢిల్లీకి వస్తారన్నారు సీఎస్ జవహర్ రెడ్డి. నిధుల్లేకే ఇటీవల జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేశాం….ఆర్థిక శాఖ సూచనల మేరకు వసతి దీవెనను వాయిదా వేశాంసంక్షేమ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాల అమలుకు నిధులతో ఇబ్బంది లేకుండా చూస్తాం అన్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి.

Read Also: BRS Ministers: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ ఉత్సవాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం