Site icon NTV Telugu

AP CS Jawahar Reddy: యూనిసెఫ్ ప్రతినిధుల బృందంతో సీఎస్ జవహర్ రెడ్డి భేటీ

Cs Jawahar Reddy

Cs Jawahar Reddy

AP CS Jawahar Reddy: యూనిసెఫ్ ప్రతినిధుల బృందంతో సీఎస్ జవహర్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. బాల్య వివాహాల నియంత్రణపై ఈ సమావేశంలో చర్చించారు. బాల్య వివాహాల నియంత్రణకు త్వరలో ప్రచార, అవగాహనా కార్యక్రమాలు చేపడతామన్నారు.

Also Read: Andhrapradesh: ఏపీ విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం

బాల్య వివాహాలను నియంత్రించకుంటే ప్రసూతి మరణాల రేటును తగ్గించలేమన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బాలికా విద్య ప్రోత్సాహానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలానికి ఒక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తెలిపారు. బాల్య వివాహాలపై ఫిర్యాదుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో తీసుకుని వస్తామన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు వివాహ రిజిస్ట్రేషన్‌ను తప్పని సరి చేశామని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version