NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్‌పై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంచలన ఆరోపణలు

Sunkara Padmasri

Sunkara Padmasri

Congress: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. గెలుపు సంగతి తర్వాత.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను కూడా రాబట్టలేకపోయింది.. అయితే, రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలను అన్యాయం చేసిందన్న ఆమె.. నచ్చిన వారికి ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చారు.. ఎందుకు? వాళ్లు ఢిల్లీ వెళ్ళి షర్మిల భజన చేస్తారనా? అని నిలదీశారు.. కాంగ్రెస్ కోసం పని చేసిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదు.. మాణిక్కం ఠాకూర్, షర్మిల, సీడబ్ల్యూసీ మెంబర్లు.. ఇలా కాంగ్రెస్ పెద్దలకు మొరపెట్టుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: NEET Results 2024 : ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. పరీక్ష రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్

ఇక, 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకుని పదవులు అనుభవించిన నాయకులు వెళ్లిపోయారని విమర్శించారు పద్మశ్రీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పనిచేశాం.. సొంత డబ్బులు, అప్పులు చేసి మరీ పార్టీ కోసం పనిచేశామన్నారు.. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనుకున్నా.. నేను కేడర్ కి న్యాయం చేయలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు సుంకర పద్మశ్రీ.. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదు. కనీసం, ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. కాగా, టిక్కెట్ల కేటాయింపు సమయంలోనూ సుంకర పద్మశ్రీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.. విజయవాడ తూర్పు టిక్కెట్ ను ఆమెకు ప్రకటించారు.. కానీ, తాను ఎంపీ టిక్కెట్ ను అడిగానని తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేయడం.. ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.