Site icon NTV Telugu

AP Congress: ఏపీసీసీ కార్యాలయంలో ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ రెండవ భేటీ

Ap Cong

Ap Cong

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ రెండవ సమావేశం అయింది. మ్యానిఫెస్టో కమిటీ కమిటీ ఛైర్మన్ పల్లంరాజు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ మీటింగ్ లో తులసిరెడ్డి, జంగా గౌతం, తాంతియాకుమారి, మస్తాన్ వలి, రమాదేవి, ఉషానాయుడు తదితర నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల్లో ప్రజాదరణ చూరగొనేందుకోసం మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ప్రాధాన్యాత కలిగిన అంశాలపై చర్చించి మ్యానిఫెస్టోను ఆమోదం కోసం ఏఐసీసీకి పంపించాలని నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: PM Modi: జమ్మూ కశ్మీర్ ను అభివృద్ధి చేస్తాం.. మోడీ గ్యారంటీ ఇలాగే ఉంటుంది..

కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ పల్లంరాజు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోనికి తీసుకు వెళ్లారు.. రాష్ట్రాన్ని పాలించిన రెండు ప్రాంతీయ పార్టీలూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ను నిర్లక్షం చేశారు.. రెండు ఫోర్టులను ప్రైవేటీకరణ చేశారు.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మివేసేందుకు ప్రయత్నం జరుగుతోంది, రాజధాని అయోమయంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుల నుంచి మంచి సలహాలు వచ్చాయి.. అన్నింటినీ మ్యానిఫెస్టోలో చేర్చి ఆమోదం కోసం ఏఐసిసీకి పంపిస్తాం.. ఏఐసీసీ ఆమోదం లభించగానే త్వరలో మ్యానిఫెస్టోను విడుదల
చేస్తాం.. సీపీఐ, సీపీఎం పార్టీలు మాతో పొత్తులో ఉన్నాయి.. వారితో చర్చించాక ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి వైసీపీలోనికి వెళ్లడంపై ఏమీ వ్యాఖ్యానించను అని పల్లింరాజు చెప్పుకొచ్చారు.

Exit mobile version