CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లా కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటనలో ఉండనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి అభి ఫంక్షన్ హాల్‌కు చేరుకొని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌ఫర్సన్ జకీయా ఖానం కుమారుడు ముష్రఫ్ అలీ ఖాన్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను దీవించి ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అనంతరంప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, రాయచోటి ముస్లిం మత పెద్దలను ముఖ్యమంత్రి జగన్ కలిశారు. ఆ తర్వాత రాయచోటిలోని రాజధాని ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకొని రాయచోటి మాజీ ఎంపీపీ జీయండి రఫీ కుమార్తె వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. నూతన వధూవరులను దీవించి ఆశీర్వదించి సీఎం జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి సొంత జిల్లా అయిన కడపకు చేరుకున్నారు.
Also Read: Nominations: సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో నామినేషన్లు దాఖలు చేసిన మంత్రులు
అనంతరం, సొంత నియోజకవర్గం పులివెందుల(వైఎస్‌ఆర్ జిల్లా)లో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పులివెందులలోనే శిల్పారామంను ప్రారంభిస్తారు. ఆపై శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఏపీ కార్ల్ ప్రాంగణంలో అగ్రిక్లచర్, హార్టికల్చర్ కాలేజీలు స్టేట్ ఆఫ్ ఆర్ట్‌సెంట్రల్ టెస్టింగ్ లేబరేటరీ, అగ్రికల్చర్ హార్టికల్చర్ ల్యాబ్‌లను సీఎం ప్రారంభిస్తారు. ఆపై ఆదిత్య బిర్లా యూనిట్‌ను సందర్శిస్తారు. అనంతరం సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. ఆ రాత్రికి ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఎస్టేట్ గెస్ట్‌హౌజ్‌లో బస చేస్తారు. ఇక 10వ తేదీ ఇడుపులపాయలో ఆర్‌కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం ఎకో పార్క్ వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు.