CM Jagan Vizag Tour: రేపు(మంగళవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ విశాఖలో పర్యటించనున్నారు. పారిశ్రామిక, వ్యాపార వేత్తల సదస్సుకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ పేరుతో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు జగన్.. అనంతరం భవిత పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించనున్నారు.
Read Also: Chandrababu: వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది.. రా కదలి రా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన వివరాలను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ వైజాగ్‌లో పర్యటన చేస్తున్నారని ఆయన వెల్లడించారు. విజన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు 2000 మంది ప్రముఖులు హాజరవుతారన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారని.. విశాఖను ఒక గ్లోబల్ సిటీగా మార్చాలనేది సీఎం ఆలోచన అని చెప్పారు. ఈస్ట్ కోస్ట్ కు గేట్ వేగా వైజాగ్‌ను చూడాలనేది సీఎం ఉద్దేశమని మంత్రి తెలిపారు. విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని విజన్ విశాఖ పేరుతో ప్రసంగిస్తారన్నారు. గ్లోబుల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా గ్రౌండ్ అయిన పెట్టుబడుల వివరాలను సీఎం జగన్ తెలియజేస్తారని మంత్రి చెప్పారు. విశాఖ అభివృద్ధికి సంబంధించి విజన్ విశాఖ డాక్యుమెంట్‌ను సీఎం జగన్ విడుదల చేస్తారని వెల్లడించారు.
1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన జీవీఎంసీ భవన్‌కు శంకుస్థాపన సీఎం జగన్ చేయనున్నారని చెప్పుకొచ్చారు. 7 కోట్ల రూపాయలతో స్కిల్ సెంటర్స్‌కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 7వ తేదీన అనకాపల్లిలో ఆసరా 4వ విడత కార్యక్రమంను ప్రారంభిస్తారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఈ సందర్భంగా చెప్పారు.