CM YS Jagan: ఈ నెల 20న(ఎల్లుండి) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. ఐజీఎమ్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, హై–టీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
Read Also: Andhrapradesh: ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు.. అధికారులను అభినందించిన సీఎం
అనంతరం తాడేపల్లికి సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (ఐజీఎంఎస్)లో ఈనెల 20న సాయంత్రం నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని క్రైస్తవ మతపెద్దలను అధికారులు కోరారు.
