Site icon NTV Telugu

CM YS Jagan: హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలి.. అధికారులకు సీఎం ఆదేశం

Jagan

Jagan

CM YS Jagan: గృహ నిర్మాణ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన అక్టోబరులో 7.43 లక్షల ఇళ్లను ఇప్పటికే మహిళలకు అందించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని అధికారులు చెప్పారు. వీటికి సంబంధించిన పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు.

Also Read: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు మెడికల్ రిపోర్టు ఇచ్చింది వైద్యులా, పొలిటికల్ డాక్టర్లా?

కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే దాన్ని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు, తాగునీరు, సోక్‌ పిట్స్‌ ఉన్నాయా? లేవా? అన్నవాటిపై ఆడిట్‌ చేయించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటిరకూ 12,72,143 మంది అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు అందించామన్నారు సీఎం జగన్. రూ.4,483 కోట్ల రుణాలు అక్కా చెల్లెమ్మలు అందుకున్నారన్నారు. పావలా వడ్డీ రుణాలపై చెల్లించాల్సిన మిగిలిన వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించనుందన్నారు.ఇప్పటి వరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Also Read: Nandamuri Balakrishna: ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ.. ప్రభుత్వంపై ఫైర్‌

టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం ఆదేశించారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పని చేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్నదానిపై వారికి అవగాహన ఇవ్వాలన్నారు. తద్వారా భవనాలు నిరంతరం నాణ్యతగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోగలుగుతారన్నారని వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం చెప్పారు.

Exit mobile version