CM YS Jagan: అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఏపీలో తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితిపై వరుసగా రెండో రోజు అధికారులతో సమీక్షించారు. అధికారులు, తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ముఖ్యమంత్రి జగన్. తుపాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తుపాను పరిస్థితులు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులకు సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు. పొలాల్లో ఉన్న ధాన్యం తడిసి పోకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిపిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు తరలించే బాధ్యతను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల వద్ద నున్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జల వనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!