CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్ట్) నుంచి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి బయలుదేరిన సీఎం జగన్.. ఇవాళ మధ్యాహ్నం లండన్ చేరుకున్నారు. జగన్ లండన్ విమానాశ్రయంలో దిగగానే.. అక్కడ కూడా జై జగన్ అంటూ నినాదాలు మారుమోగాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. చిరునవ్వుతో జగన్ ఎయిర్‌పోర్టులో ఉల్లాసంగా కనిపించారు. ఈ నెల 31వ తేదీ తిరిగి బెజవాడ చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Fake Notes : తొమ్మిదో తరగతి ఫెయిల్.. యూట్యూబ్‌లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి..
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు.. లోకేష్ కి అమెరికన్ సిటీజన్ షిప్ ఉన్నట్టు కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు.. అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్ లు ముందుగానే లోకేష్ పెట్టినట్టు గుర్తించారు.. సీఎం జగన్ వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్ కనపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అయితే, పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో గుండె పోటు వచ్చిందని లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తుండగా.. ఆ వెంటనే లోకేష్‌ను ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు.. అయితే, సీఎం జగన్ విదేశీ పర్యటనకు లోకేష్‌కి సంబంధం ఏంటి? ఆ సమయంలో ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు..? లోకేష్.. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను ఎవరికి పెట్టాడు..? తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు పోలీసులు.