CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్ నినాదాలతో యాత్ర మార్మోగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలోకి ఈ బస్సు యాత్ర ప్రవేశించగానే సీఎం జగన్‌కు జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉదయం పత్తికొండ నుంచి ప్రారంభమైన యాత్ర గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లి మీదుగా అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అయింది. గుత్తిలో జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మార్గం మధ్యలో అక్కడక్కడా బస్సును నిలుపుతూ అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలతో ఆప్యాయంగా మాట్లాడుతూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. తమ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు.
Read Also: Andhra Pradesh: వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
గుత్తి పట్టణంలోకి బస్సు యాత్ర ప్రవేశించినప్పటి నుంచి సుమారు 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు జనం ప్రభంజనంలా కదిలారు. మధ్యాహ్న భోజన విరామ సమయం లేకుండానే బస్సుయాత్ర కొనసాగింది. గుత్తి రైల్వే బ్రిడ్జి నుంచి గుత్తి హైవే వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర దాదాపు రెండు గంటలపాటు బస్సు యాత్ర కొనసాగింది.మరోవైపు కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా బారులు తీరిన జనంతో గుత్తి పట్టణం నిండిపోయింది. బస్సుయాత్రలో గుత్తి పట్టణంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుతో పాటు సమాంతరంగా ప్రధాన రహదారిలో జనం కదులుతూ వచ్చారు.