NTV Telugu Site icon

CM YS Jagan: కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుంది: సీఎం జగన్

Ap Cm Ys Jaganmohan Reddy

Ap Cm Ys Jaganmohan Reddy

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్‌ పద్ధతిలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా సుమారు రూ.6600 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై అవగాహనా ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 సబ్‌ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించామని, కొన్నింటి పనులు ప్రారంభిస్తామన్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారని పేర్కొన్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు.

Read Also: Malla Reddy: మల్లారెడ్డి మాటలకు హర్టయిన బాలీవుడ్?

12 సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్‌ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్‌ చేస్తున్నామన్నారు. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టామన్నారు. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్‌ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని.. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. ఇప్పుడు సగటున రూ.2.4కే యూనిట్‌ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నామన్నారు. దాదాపు రూ.3099 కోట్లతో సబ్‌స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించామని, మరి కొన్నింటి పనులు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.

Read ALso: Revanth Reddy: నేను కామారెడ్డిలో పోటీ చేస్తుంది అందుకే.. క్లారిటీ ఇచ్చిన రేవంత్‌

రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్‌ పవర్‌కు శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. రూ. 6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని వెల్లడించారు. అవేరా స్కూటర్స్‌ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుందన్నారు. తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయన్నారు. 28 సబ్‌ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 850 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నామన్నారు. సోలార్‌,విండ్‌, పీఎస్పీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారని.. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.