Site icon NTV Telugu

AP CM Jagan: స్కామ్‌లు తప్ప.. స్కీమ్‌లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఫైర్

Jagan

Jagan

AP CM Jagan: చిలకలూరిపేట సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఫైర్‌ అయ్యారు. స్కామ్‌లే తప్ప.. స్కీమ్‌లు తెలియని బాబులు అంటూ ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీ మాత్రమే వారికి తెలుసని ఆయమ మండిపడ్డారు. లంచావతారాలు.. గజ దొంగలు.. వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్‌ మంచావతారాలు.. సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్న జీవులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ బిడ్డను ఎదుర్కోలేక… పలానా మంచి పని చేశామని చెప్పుకోలేక.. ప్రతిపక్షాలు జిత్తులు, ఎత్తులు, పొత్తులతో కుయుక్తులు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. వీటితోనే రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. మీ బిడ్డ ఒక్కడు ఓ వైపు నవరత్నాలతో ఎదురుగా వస్తుంటే.. అక్క చెల్లెమ్మల నుంచి వస్తున్న మద్దతును చూసి తట్టుకోలేక తోడేళ్లు ఒక్కటవుతున్నాయని సీఎం విమర్శించారు. తనకు అంగబలం, అర్థ బలం, మీడియా బలం లేదని..దే వుడి దయ, ప్రజల ఆశీస్సులే ఉన్నాయన్నారు. పొత్తులపై ఆధారపడనన్న ముఖ్యమంత్రి.. తనకు ఎవరితోనైనా పొత్తు అంటే.. అది ప్రజలతోనేనన్నారు. కారణం తనకు కుయుక్తులు చేతకాదు, అబద్ధాలు చెప్పలేను.. మోసం చేయలేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read Also: Vidadala Rajini: నా రాజకీయ భవిష్యత్ జగన్‌ పెట్టిన భిక్షే.. మంత్రి భావోద్వేగం

‘నాకు పన్నాగాలు, జిత్తులు చేతకాదు. నేను నేరుగా చెప్తాను.. ఏది చెప్తానో.. అది చేస్తాను:అందుకే ప్రతి విషయంలోనూ ఆలోచనలు చేయాలని చెప్తున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి… సైనికులుగా నిలవండి. మీ బిడ్డకు ఉన్నది మీరే. మీరే సైనికులు కావాలని కోరుతున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితే.. మీ బిడ్డకు తోడుగా నిలవండి.’ అని సీఎం జగన్‌ అన్నారు.

 

Exit mobile version