NTV Telugu Site icon

CM YS Jagan: పిఠాపురంలో ప్రచారాన్ని ముగించనున్న సీఎం జగన్‌.. నేటి షెడ్యూల్‌ ఇదే..

Jagan

Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. వైనాట్ 175 అంటున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ పిఠాపురంలో ఆఖరి అస్త్రాన్ని సంధించబోతున్నారు. ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఉదయం పది గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్‌ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. ఒంటి గంటకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో సభలో పాల్గొంటారు. చివరగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రచారాన్ని ముగిస్తారు సీఎం జగన్.

Read Also: Crime: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నూతన వరుడితో సహా నలుగురు సజీవ దహనం

అయితే, మొదటి నుంచీ వైసీపీ పిఠాపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో.. ఆయనపై అదే సామాజికవర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దింపింది వైసీపీ. పవన్ కల్యాణ్‌ ప్రచార సభల్లో సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తుండటంతో.. ఇవాళ్టి సభలో సీఎం జగన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారా అనే ఆసక్తి ఏర్పడింది. సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్ర, ప్రచార భేరి ఇలా.. విడతలవారీగా ప్రచారాన్ని నిర్వహించారు సీఎం జగన్. దాదాపుగా జనవరి నుంచి ప్రచారంలోనే ఉన్నారు. ఈ రోజు ప్రచారానికి ఫైనల్‌ టచ్‌ ఇవ్వనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పిఠాపురంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.