Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cm Ys Jagan Vizianagaram District Tour On Aug 25th

CM YS Jagan: రేపు విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

Published Date :August 24, 2023 , 7:54 pm
By Sudhakar Ravula
CM YS Jagan: రేపు విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: బిజీబిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఓవైపు అధికారిక కార్యక్రమాలు, మరోవైపు పార్టీ సమావేశాలు, సమీక్షలు.. వివిధ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, వివిధ శాఖలపై సమీక్షలు.. ఇలా నిత్యం ఎంతో బిజీగా ఉంటున్న ఆయన.. రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్ధాపన చేయనున్నారు. ఇక, దీని కోసం రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి.. విజయనగరం జిల్లాకు చేరుకోనున్న ఆయన.. మెంటాడ మండలం చినమేడపల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం జగన్.. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

Read Also: NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్

ఇక, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనకు సంబంధించిన పనులను పరిశీలించారు డిప్యూటీ సీఎం రాజన్నదొర.. మరోవైపు, యూనివర్సిటీ కోసం మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో భూసేకరణ జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.. మౌలిక వ‌స‌తులు, న‌ష్ట ప‌రిహారం చెల్లింపు, ఇత‌ర అవ‌సరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 58.49 కోట్ల వ‌ర‌కు వెచ్చిస్తుందని డిప్యూటీ సీఎం రాజన్నదొర తెలిపారు. కాగా, ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ సంబంధించిన క్లాసులను తాత్కాలిక భవనంలో కొనసాగిస్తోన్న విషయం విదితమే. ఇక, సీఎం పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. సీఎం రాకతో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Dharmendra Pradhan
  • tribal university
  • vizianagaram district

తాజావార్తలు

  • Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..

  • Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

  • Gas Prices Hiked: శ్రీలంకలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు.. అర్థరాత్రి నుంచే అమలు.

  • Air India: ఎయిర్ ఇండియా షాకింగ్ డెసిషన్.. మే 31 వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేత

  • PM Modi: న్యాయాధికారులకే రక్షణ లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి..? మమతపై మోడీ ఫైర్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions