YS Jagan: రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం: సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం అని పేర్కొన్నారు. ఈరోజు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని, రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. డా. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
‘స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం. ఆ పవిత్ర గ్రంథ రూపకర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో భాగంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
Also Read: TTD: ‘గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తాం: టీటీడీ ఈవో ధర్మా రెడ్డి
‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆనాడు ఆయన వేసిన బీజం ఎంత ధృడమైనదో అర్ధమవుతుంది. భారత రాజ్యాంగం పవిత్రమైన గ్రంధం. దేశ సమగ్రతకు భంగం కలగకుండా రాజ్యాంగం కాపాడుతోంది. ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడాలని రాజ్యాంగంలో రూపొందించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనింది. ఐరోపా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతోంది. స్వాతంత్ర్య సమరయోధులు.. అంబేద్కర్ వంటి వారు దేశానికే గర్వకారణం. చరిత్రలో నిలిచిపోతారు’ అని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!