NTV Telugu Site icon

YS Jagan: రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం: సీఎం జగన్‌

Ys Jagan

Ys Jagan

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. స్వ‌తంత్ర భార‌తావ‌నిని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం అని పేర్కొన్నారు. ఈరోజు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని, రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. డా. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

‘స్వ‌తంత్ర భార‌తావ‌నిని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం. ఆ ప‌విత్ర గ్రంథ రూప‌క‌ర్త‌ల‌ను అనుక్ష‌ణం స్మ‌రించుకుంటూ మ‌న ప్ర‌భుత్వంలో వారి గౌర‌వార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. ఇందులో భాగంగా విజ‌య‌వాడ‌లో అంబేడ్క‌ర్ స్మృతివ‌నంతో పాటు ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ గారి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశాం. అంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం శుభాకాంక్ష‌లు’ అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Also Read: TTD: ‘గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తాం: టీటీడీ ఈవో ధర్మా రెడ్డి

‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆనాడు ఆయన వేసిన బీజం ఎంత ధృడమైనదో అర్ధమవుతుంది. భారత రాజ్యాంగం పవిత్రమైన గ్రంధం. దేశ సమగ్రతకు భంగం కలగకుండా రాజ్యాంగం కాపాడుతోంది. ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడాలని రాజ్యాంగంలో రూపొందించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం బలంగా వేళ్లూనింది. ఐరోపా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతోంది. స్వాతంత్ర్య సమరయోధులు.. అంబేద్కర్ వంటి వారు దేశానికే గర్వకారణం. చరిత్రలో నిలిచిపోతారు’ అని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.