NTV Telugu Site icon

Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్.. నేడు రైతుల ఖాతాల్లోకి నిధులు

Ap Cm Jagan

Ap Cm Jagan

Rythu Bharosa Funds: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో ప‌ర్యటించ‌నున్నారు. వరుసగా ఐదవ సంవత్సరం మొదటి దశ వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. బటన్ నొక్కి రైతు భరోసా నిధులను సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మొదటి విడతగా 52,30,939 మంది రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద ఒక్కో రైతుకు రూ.5,500, పీఎం కిసాన్ యోజన కింద మరో రూ.2,000 కూడా నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖరీఫ్ నాట్లు వేసే సమయంలో రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ చేస్తుంది. రైతు భరోసా కింద ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రూ.3,923 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో రైతులకు రూ.30,985 కోట్లు పంపిణీ చేసింది.

Read Also: Akash Ambani : అంబానీ ఇంట వారసురాలు జననం.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్‌ దంపతులు

రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయంతో పాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీజన్‌ ముగియక ముందే పంట నష్ట పరిహారం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్‌ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో సీఎం జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు వివిధ పథకాల ద్వారా రూ.1,61,236.72 కోట్ల మేర నేరుగా సాయాన్ని అందించడం గమనార్హం.