Site icon NTV Telugu

CM YS Jagan Meet PM Modi: ప్రధాని మోడీతో సీఎం జగన్‌ చర్చించిన అంశాలు ఇవే..

Cm Pm

Cm Pm

CM YS Jagan Meet PM Modi: ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీలో రాజకీయాలు కాకరేపుతోన్న సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.. అసలు, ప్రధానితో సీఎం జగన్‌ రాజకీయ అంశాలపై చర్చించడానికే వెళ్లారనే విమర్శలను ప్రతిపక్షాలు చేశాయి.. అయితే, పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన ఏపీ సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారని.. సీఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి ఇవేనంటూ ఓ ప్రకటన విడుదల చేసింది సీఎం కార్యాలయం..

ప్రధాని మోడీతో సీఎం జగన్‌ చర్చించిన ప్రధాన అంశాలు..
* పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని వినతి.

* పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరిన సీఎం.

* 2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి.

* రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరిన సీఎం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పాడని తెలిపిన సీఎం.

* రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని పీఎం దృష్టికి తీసుకెళ్లిన సీఎం. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని వినతి.

* విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరిన సీఎం.

* విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని కోరిన సీఎం. కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్‌ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరిన సీఎం. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందన్న సీఎం.

* విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

Exit mobile version