NTV Telugu Site icon

CM YS Jagan: సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో సెంచురీ ప్లై వుడ్‌ పరిశ్రమ యూనిట్‌ను సీఎం జగన్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం సంస్థ ఉద్యోగులతో ఇంటరాక్షన్ అయ్యారు. కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బద్వేల్ నియోజకవర్గం గోపవరం దగ్గర 490 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసింది. పారిశ్రామిక పార్క్‌లో యాంకర్ యూనిట్‌గా సెంచురీ ప్యానల్స్‌ ఇండస్ట్రీ ఏర్పాటు జరిగింది. వంద ఎకరాల్లో 1,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేశారు. 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరిన్ని వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. సరిగ్గా రెండేళ్ళ కిందట సెంచురీ ప్యానల్స్ పరిశ్రమను డిసెంబర్ 23, 2021న భూమి పూజ చేశారు సీఎం జగన్. ఇవాళ సెంచురీ పరిశ్రమ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించడం గమనార్హం.

Read Also: Undavalli Arun Kumar: ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి..

అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి కడపకు సీఎం జగన్‌ చేరుకోనున్నారు. కడప రిమ్స్‌ వద్ద డాక్టర్‌ వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఇన్సిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, డాక్టర్‌ వైఎస్సార్‌ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంకు సీఎం జగన్‌ చేరుకోనున్నారు. స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్‌ లైట్లను ప్రారంభించనున్నారు. అనంతరం ఆధునికీకరించిన కలెక్టరేట్‌ భవనం, అంబేద్కర్‌ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ ప్రారంభించనున్నారు. మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేయనున్నారు. రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌లో బస చేయనున్నారు.