Site icon NTV Telugu

CM YS Jagan: నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం పర్యటన.. హిందూపురంలో ప్రసంగంపై ఆసక్తి..!

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. ఈ రోజు కూడా మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న జగన్‌.. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులో పర్యటిస్తారు.. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభకు హాజరై సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో జగన్ పర్యటన కొనసాగనుంది.. గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Read Also: Tribal Women : గిరిజన మహిళలకు అండగా సీఆర్‌పీఎఫ్‌

అయితే, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్నికలలో ప్రచారంలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఉదయం 11 గంటలకు హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో సభ నిర్వహించనున్నారు.. రెండు వేల మందితో భారీ పోలీసు బందోబస్సు ఏర్పాటు చేస్తున్నారు.. అయితే, ఈ సారి హిందూపురంలో జెండా ఎగురవేస్తామంటున్నాయి వైసీపీ శ్రేణులు. కానీ, హాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పనిచేస్తున్నారు.. అయితే, బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version