NTV Telugu Site icon

AP CM Jaganmohan Reddy: రేపటి ముఖ్యమంత్రి అనంతపురం పర్యటన వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Jagan

Jagan

AP CM Jaganmohan Reddy: సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల పర్యటన వాయిదా పడింది. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సీఎం రానున్నట్లు ముందుగా తెలిసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నార్పల మండల కేంద్రంలో రేపు జరగబోయే జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం. సీఎం పర్యటన రద్దు అయినట్లు శింగనమల ఎమ్మెల్యే కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల 17 వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో జరగనున్న జగనన్న వసతి దీవెన కార్యక్రమం అనివార్య కారణాల వలన వాయిదాపడిందని జిల్లా కలెక్టర్ఎ మ్.గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన తదుపరి తేదీని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందిన తర్వాత తెలియజేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

Read Also: Nizamabad Hospital: ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటన.. తల పట్టుకుంటున్న అధికారులు

ఇదిలా ఉండగా.. రేపు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనున్నారు. వన్‌ టౌన్‌ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.