NTV Telugu Site icon

AP CM Jagan: పారదర్శకంగా పోలవరం పునరావాస ప్యాకేజీ .. అందరికీ న్యాయం చేస్తాం

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan: ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. గొమ్ముగూడెంకు చెందిన వరద ముంపు బాధితులతో సమావేశంలో పాల్గొని సీఎం జగన్‌ మాట్లాడారు.

గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వరద బాధితులను ఆదుకుంటున్నామని.. వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదన్నారు. సహాయక చర్యల్లో కలెక్టర్లకు అన్ని రకాల అధికారాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. వరద బాధితులకు సాయం అందకుంటే ఫిర్యాదు చేయొచన్నారు. పోలవరం డ్యాంలో మూడు దశల్లో నీళ్లు నింపుతామని.. ఒక్కసారిగా నింపితే డ్యామ్‌ కూలిపోవచ్చని సీఎం చెప్పుకొచ్చారు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని.. కమిషన్‌ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నామన్నారు.

Also Read: TTD: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం

ఆర్‌ అండ్‌ ఆర్‌ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు అందిస్తామని.. ఆర్‌ ఆండ్‌ ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రం ఒత్తిడి తెస్తున్నామన్నారు సీఎం జగన్. జనవరి కల్లా ప్యాకేజీ అందే విధంగా చూస్తామన్నారు. 2025 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తి చేసి నీరందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే 6,7 నెలల్లో మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచి జరుగుతుందన్నారు. ఐదు లక్షల ప్యాకేజీలో ఒకటిన్నర లక్షలు ఇచ్చామని.. మిగిలిన రూ. 3.50 లక్షలు త్వరలో ఇస్తామన్నారు. అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. లిడార్‌ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. లిడార్‌ సర్వే సైంటిఫిక్‌గా జరిగింది.. ఎవరికీ అన్యాయం జరగదన్నారు. భూములు కొనుగోలుకు సంబంధించి మరింత న్యాయం చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Also Read: Kodali Nani: దాడి చేస్తే ఊరుకోం… పవన్ పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్..

అంతకు ముందు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్‌ పర్యటించారు. అక్కడ మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే తమ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. ఆర్‌&ఆర్‌ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు అందిస్తామన్నారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధిలేకుండా వ్యవహరించారని విమర్శించారు. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపుతుందన్నారు. పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదన్నారు. బాధితులకు రావాల్సిన ప్యాకేజ్‌పై మంచి జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని.. ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా అధికారులు సాయం అందించారన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.