మూడో రోజు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం 10:30కి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం జగన్ కలవనున్నారు. రాష్ట్ర పరిస్థితులు, ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపనలను హోం మంత్రికి అందజేయనున్నారు జగన్. నిన్న మధ్యాహ్నం ప్రధాని మోడీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్‌ను సీఎం జగన్ కలిశారు. అయితే.. విభజన చట్టంలో ఏపీకి నెరవేర్చాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన హామీలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు జగన్. విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ.. విభజన చట్టంలో అంశాల అమలుకు ఉన్న పదేళ్ల కాలపరిమితి.. ఎనిమిదిన్నరేళ్లు గడిచినా పెడింగ్ లో ఉన్న అనేక అంశాలు. విభజన చట్టం అమలు, షెడ్యూల్ 9, 10 పంపకాల జాప్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి.
Also Read : Trail Run : రేణింగవరం వద్ద హైవే రన్‌వే ట్రైల్ రన్.. రన్ వే పై దిగనున్న నాలుగు ఫైటర్ జెట్ విమానాలు, కార్గో విమానం
అయితే.. నిన్న ప్రధానికి కలిసిన జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చించారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలను విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పునవర్విభజన చట్టంలోని అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీల అమలుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని.. హామీల అమల్లో కొంత పురోగతి సాధించినా, మరిన్ని కీలక అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలను, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఏపీ ఆ లోటును భరిస్తోందని వివరించారు.