NTV Telugu Site icon

CM Jagan Mohan Reddy:మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై జగన్‌ సమీక్ష

Cm Jagan Law Nestham

Cm Jagan Law Nestham

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఫౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10 వేలకు పైగా అంగన్‌వాడీల్లో పనులు గురించి వాకబు చేశారు. అంగన్‌ వాడీలలో నాడు – నేడు పనుల పై సీఎం సమీక్ష చేశారు. అంగన్‌వాడీ సెంటర్లలో ఉన్న సదుపాయాల పై గ్రామ సచివాలయాల నుంచి సమాచారం తెప్పించుకోవాలి. అంగన్‌వాడీల్లో చేపట్టాల్సిన పనుల పై ప్రతిపాదనల పై నివేదిక తయారు చేయండి. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే గ్రోత్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ లను అంగన్‌వాడీల్లో ఉంచాలన్నారు.

Read Also: Viral Video: ట్రైన్‌ లో భర్త చేస్తున్న పని.. సీక్రెట్‌ గా వీడియో తీసిన ప్రయాణికుడు

ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయండి. మహిళా శిశు సంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయండి. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలి. క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలి.

అంగన్‌వాడీల్లో సూపర్‌ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇటు జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. సమావేశంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మాన, బొత్స సత్యనారాయణ, ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాం. మే 20 నాటికి 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీ చేయాలన్నారు సీఎం జగన్. ఇప్పటికే 1.94 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీకి సిద్దం అయ్యాయి. భూ వివాదాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. అర్బన్ ఏరియాల్లో పీఓఎల్ఆర్ నివేదికలపై సమీక్ష చేశారు సీఎం జగన్.

Read Also: Anti-Hindu hate: బ్రిటన్ లో పెరుగుతున్న హిందూ వ్యతిరేకత.. మతం మారాలని ఒత్తిడి..