Site icon NTV Telugu

Andhrapradesh: వరదల్లో ఎస్సై సాహాసోపేత రెస్క్యూ ఆపరేషన్‌.. అభినందించిన ముఖ్యమంత్రి

Koonavaram Si

Koonavaram Si

Andhrapradesh: గత ఏడాది, ఈ ఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించిన కూనవరం ఎస్సైని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభినందించారు. హెలిప్యాడ్‌ నుంచి కూనవరంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతున్న సందర్భంలో ఒక విజ్ఞాపన కోసం ముఖ్యమంత్రి బస్సు దిగారు. అదే సమయంలో అక్కడున్న స్థానికులు అధికారులు బాగా పని చేశారని సీఎంకు చెప్పారు.

Also Read: Madhavaram Krishna Rao : బాలానగర్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

స్థానిక ఎస్సై వెంకటేషన్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సాహసోపేతంగా నిర్వహించారని గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలకపాత్ర పోషించారని సీఎం ఎదుట మెచ్చుకున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్సై వెంకటేశ్‌ను సీఎం భుజం తట్టి, అభినందించారు. పోలీస్‌ మెడల్‌ ఇవ్వాలంటూ అధికారులకు సిఫార్సు చేశారు.

Exit mobile version