NTV Telugu Site icon

CM Chandrababu: నేడు సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలంకు సీఎం చంద్రబాబు

Cbn

Cbn

CM Chandrababu: ఇవాళ ఉదయం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్ ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, పర్యాటక శాఖామంత్రి, ఇతర స్ధానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటారు‌.. పున్నమి ఘాట్‌ నుంచి సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో ప్రయాణిస్తారు.. సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు.. ఇతర మంత్రులు.. ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ వద్దకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సీ ప్లేన్ లో శ్రీశైలం చేరుకుంటారు.. ఆ తర్వాత శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు.. అనంతరం శ్రీశైలం‌ నుంచి తిరిగి విజయవాడకు సీ ప్లేన్ లో వెళ్లనున్నారు..

Read Also: Citadel Honey Bunny Review: సిటాడెల్: హనీ బన్నీ రివ్యూ.. సమంత స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో పర్యటన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు.. పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ సర్వీసులను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా శ్రీశైలంలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఫారెస్ట్‌లో గ్రేహౌండ్స్​ బలగాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్​ లో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు, పోలీసు బలగాలు హై స్పీడ్​ ఇంజన్​ బోట్లతో రెస్క్యూ టీమ్​ ను మోహరించారు.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్‌ నుంచి సీ ప్లేన్ లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు శ్రీశైలం పాతాళగంగ వద్ద బోటింగ్ పాయింట్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొని.. తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు.. ఆ తర్వాత తిరిగి విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments