Site icon NTV Telugu

AP CM Chandrababu: తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి సీఎం చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu

AP CM Chandrababu: సచివాలయంలోని మొదటి బ్లాకులో రియల్ టైం గవర్నెన్స్ సెంటరును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి ముఖ్యమంత్రి వెళ్లారు. అధికారంలోకి వచ్చాక సెక్రటేరీయేట్‌లో ఓ విభాగాన్ని తొలిసారి సీఎం సందర్ళించారు. 2014-19 మధ్య కాలంలో ఆర్టీజీఎస్ విభాగంలో చంద్రబాబు తరుచూ సమీక్షలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఆర్టీజీఎస్ వ్యవస్ఖ మారింది. ఆర్టీజీఎస్ సెంటర్‌లో సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌరసేవలను సులభతరం చేయడం.. పాలనలో వేగం పెంచడంపై సమావేశంలో చర్చించారు.

Read Also: Prakash raj: పవన్ కళ్యాణ్ ఫైర్.. వీడియో రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్

ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సిస్ చేసుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆధార్, వాక్సినేషన్ డాటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్‌గా అందే అంశంపై చర్చించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తీసుకోదగిన చర్యలపై చర్చించారు. సీసీటీవీ కెమేరాలు, డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత, నాణ్యతపై సమావేశంలో చర్చించారు. రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని సీఎం తెలిపారు. రియల్ టైం గవర్నెస్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Exit mobile version