NTV Telugu Site icon

CM Chandrababu: ప్రభుత్వ విజన్‌పై చర్చలు జరిపాం.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీపై సీఎం ట్వీట్

Chandrababu

Chandrababu

CM Chandrababu: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ విశేషాలను సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై వారితో చర్చలు జరిపినట్టు సీఎం ట్వీట్ చేశారు. భవిష్యత్ రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా రెండు బ్యాంకులను ఆహ్వానించినట్టు వెల్లడించారు.

Read Also: AP CM Chandrababu: గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు.. వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2.0..

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆ నిధులను సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై చర్చించారు. అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన నేపథ్యంలో ఈ చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశలవారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు.

అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. సీఆర్డీఏ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. ఈ నెల 27వ తేదీ వరకు ఏపీలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించనున్నారు.