NTV Telugu Site icon

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు!

Cm Chandrababu

Cm Chandrababu

సోమవారం రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్‌ను కూడా సీఎం విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ ఏడాది జూన్ 17న మెుదటిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజినీర్లతో సీఎం మాట్లాడనున్నారు.

సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వచ్చే సమయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్ నుంచి చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Show comments