NTV Telugu Site icon

CM Chandrababu: మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్లకు అదే చివరి రోజు.. సీఎం వార్నింగ్‌

Babu

Babu

CM Chandrababu: మహిళల మీద అత్యాచారాలు చేసే వాళ్లకు అదే చివరి రోజు అవుతుంది అని వార్నింగ్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పథకాన్ని ప్రారంభించారు.. స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్‌ అందించారు సీఎం.. ఇక, ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివిధ అంశాలను ప్రస్తావించారు. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటాం.. మహిళల మీద అత్యాచారాలు చేసేవాళ్లకు అదే చివరి రోజు అవుతుంది అంటూ హెచ్చరించారు. ఇప్పటి వరకు మర్యాదగా చెప్పాను.. గంజాయి మత్తులో వికృత వేషాలు వేస్తే ఎవరిని వదిలిపెట్టను అని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఇక, పోలవరం పూర్తిఅయితే రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చేవాళ్ళం.. అమరావతి పూర్తి అయ్యి ఉంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరికేది అన్నారు చంద్రబాబు.. కానీ, గత ప్రభుత్వ పాలన మొత్తం తప్పులు, అప్పులు గానే సాగిందన్నారు.. ఎంత అప్పు ఉందో తెలియడం లేదు.. అయితే, సంపద సృష్టించే భాధ్యత నాది.. పేదరికం లేని సమాజం కోసం ప్రయత్నిస్తున్నా.. ఇచ్చిన హామీని 26 రోజుల్లో అమలు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టిడిపి .. ఆ దిశగా పనిచేస్తా అన్నారు. మరోవైపు.. సీఎం వస్తున్నాడంటూ హడావిడి వద్దు.. పదరాలు కట్టొద్దు అని సూచించారు.. పరదాలు కడితే, కట్టిన అధికారికి సస్పెన్షన్ తప్పదు అని హెచ్చరించారు.. షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధం గా ఉన్నా.. రాబోయేది చంద్రబాబు 4.0 పాలన … 95 సీబీఎన్‌ని చూస్తారు అని తెలిపారు సీఎం చంద్రబాబు.