NTV Telugu Site icon

CM Chandrababu: రెండు మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక

Chandrababu

Chandrababu

CM Chandrababu: విశాఖపట్నం కలెక్టరేట్‌లో విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఆ అంశాలు ఏంటంటే..
1. జీరో పావర్టీ (అసమానతల తొలగింపు)
2. ఉద్యోగాల సృష్టి, కల్పన
3. నైపుణ్యత పెంపుదల
4. రైతు సాధికారత, ఆదాయం పెంపు
5. తాగు నీటి రక్షణ
6. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి
7. స్వచ్ఛ ఏపీ
8. మానవ వనరుల నిర్వహణ, వినియోగం
9. శక్తి వనరుల వినియోగం, నిర్వహణ
10. అన్ని రకాల సాంకేతిక జ్ఞానం పెంపుదల, పరిశోధన

Read Also: Tirupati Crime: లాడ్జిలో మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్

పి.పి.పి. విధానం వల్ల సంపద సృష్టి జరిగిందని.. ఇప్పుడు పి – 4తో అవే ఫలితాలు సాధిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానానికి నాంది పలుకుదామన్నారు. రతన్ టాటా హబ్‌గా ఏపీ… ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. డ్రోన్ దీదీలో భాగంగా ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.8 లక్షల సాయం – డ్రోన్ వినియోగంపై అవగాహన కల్పిస్తామన్నారు. భవిష్యత్తును అంచనా వేస్తూ కలెక్టర్లు, అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. మానవ వనరుల వినియోగంలో 2047 నాటికి ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఇండియా ఎదుగుతుందన్నారు. సంపద సృష్టికి… అభివృద్ధికి డబ్బు కన్నా… మంచి ఆలోచన ముఖ్యమన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై విశాఖపట్నంలో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

విశాఖ మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్రణాళిక, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో గ్రోత్ హబ్, రోడ్ల అనుసంధానం తదితర అభివృద్ధి పనుల్లో పి.పి.పి. విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అధికారులు హార్డ్ వర్క్ కాదు… స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. విశాఖలో పర్యాటకం అభివృద్ధికి పెద్ద పీట వేయాలన్నారు. విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు వేసేందుకు ప్లాన్ చేయాలన్నారు. హైదరాబాద్ మాదిరిగా విశాఖ అభివృద్ధి చెందాలన్నారు. విశాఖ జనాభా ప్రస్తుతం సుమారు 26 లక్షలు ఉంది… ఉత్తరాంధ్ర జిల్లాలను అనుసంధానం చేస్తూ 50 లక్షలు, కోటి వరకు జనాభా పెరగాలన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం… 15 శాతం వృద్ధి సాధించే దిశగా సాగాలని సీఎం సూచించారు. 2025 లేదా 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చే నాటికి అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి అయిపోవాలన్నారు. టాటా, జీ.ఎం.ఆర్.లాంటి సంస్థలను మెంటార్లుగా తీసుకొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.