NTV Telugu Site icon

AP CM Chandrababu: సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలి..

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

AP CM Chandrababu: రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలా అయితే గేమ్ ఛేంజర్ అయ్యిందో.. రానున్న రోజుల్లో పకృతి వ్యవసాయం కూడా గేం ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకృతి సేద్యంలో ఎపి పయనీర్ గా నిలవాలని….దీనికి టెక్నాలజీని జోడించడం ద్వారా అనూహ్య, అద్భుత ఫలితాలు సాధించవచ్చని సిఎం అన్నారు. ప్రకృతి సేద్యం – అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఏపీ వ్యవసాయ రంగంలో దిక్సూచి అయ్యేలా చేయాలని.. అందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఖర్చులు గణనీయంగా పెరిగి రైతులకు సాగు భారంగా మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ ద్వారా ఆ ఖర్చులు తగ్గించాలని అన్నారు.

Read Also: Passing Out Parade: అనంతపురంలో రేపు ‘డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్’

పంటల సాగులో డ్రోన్ల వాడకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పంటల సాగుకు 40 వేల డ్రోన్లు అవసరం పడతాయని అధికారులు వివరించారు. సాగులో డ్రోన్లకు కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని…. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కూడా కల్పిస్తుందని…ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సిఎం సూచించారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు డ్రోన్ లపై శిక్షణ ఇచ్చి డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దితే ఇదొక కుటీర పరిశ్రమ అవుతుందన్నారు. గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పకృతి సేద్యాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని తెలిపిన అధికారులు….ప్రకృతి సేద్యంతో సాగయ్యే పంటలు సాధారణ పంటలకంటే ఎక్కువగా వరదలు, విపత్తులను తట్టుకుంటున్నట్లు పరిశీలనలో తేలిందని అధికారులు వివరించారు. రెండు నెలల క్రితం వచ్చిన భారీ వర్షాలు, వరదల సమయంలో చేసిన స్టడీలో ఈ విషయాలు వెలుగు చూశాయని తెలిపారు. ఒకే ప్రాంతంలో పక్క పక్కనే ప్రకృతి సాగు, సాధారణ సాగు చేసిన ఒకే రకమైన పంటలు…. వరదలకు దెబ్బతిన్న శాతాన్ని పరిశీలించి తాము ఈ అంశంపై నివేదిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.

Read Also: CM Chandrababu: గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

వరదల కారణంగా కెమికల్ ఫార్మింగ్ జరిగే పంటలు 100 శాతం దెబ్బతింటే….ఆ పక్కనే ఉన్న ప్రకృతి వ్యవసాయం కింద సాగయ్యే పంట 10 శాతం మాత్రమే దెబ్బతిన్నట్లు తాము గుర్తించామని అధికారులు తెలిపారు. ఇది చాలా కీలకమైన అంశమని…రైతులను ప్రకృతి సాగు వైపు తీసుకువెళ్లడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని సిఎం అన్నారు. ఇలాంటి సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చి వారిని పకృతి సేద్యం లాభాల గురించి తెలుసుకునేలా చేయాలని సిఎం చెప్పారు. అంతకుముందు అధికారులు పంట ఉత్పత్తుల పెంపు, సాగు విస్తీర్ణం పెంపు, భూసార పరీక్షలు వంటి అంశాల్లో తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా భూసార పరీక్షలు చేసి రైతులకు అవసరమైన పోషకాలు అందించే పరిస్థితి రావాలని సిఎం అన్నారు. జూలై నెలలో జరిగిన పంటనష్టానికి సంబంధించి రూ.37 కోట్లు రైతులకు పరిహారం కింద చెల్లించాల్సి ఉందని అధికారులు చెప్పగా…ఆ నిధుల విడుదలకు సిఎం అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలతో రైతుల పంటనష్టానికి గాను రూ.319 కోట్లు నెలరోజుల వ్యవధిలోనే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల ప్రకారం ఈ రబీ నుంచి పాత పద్దతిలో క్రాప్ ఇన్స్యూరెన్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Show comments