NTV Telugu Site icon

CM Chandrababu: రహదారులపై ఫోకస్‌.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్లపై ఫోకస్‌ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల దుస్థితిపై చర్చించనున్నారు.. వర్షాకాలం రహదారులు మరింత దెబ్బతినే అవకాశం ఉన్నందున, ప్రజలు ఇబ్బంది పడకుండా.. ముందు గుంతలు పూడ్చేలా చర్యలకు ఆదేశించనున్నారు సీఎం.. అయితే, గత ఐదేళ్లు కాలంగా రహదారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. దాంతో.. రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయనే విమర్శలు లేకపోలేదు.. ఇక, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉందంటూ.. గతంలో.. టీడీపీ, జనసేన వివిధ సందర్భాల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌లు కూడా నిర్వహించింది.. రోడ్లు దుస్థితిపై జనసేన సోషల్‌ మీడియా వేదికగా ఓ క్యాంపెయిన్‌ నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పుడు రోడ్ల పరిస్థితిపై దృష్టిసారించారు సీఎం చంద్రబాబు.. ఈ రోజు జరిగే సమావేశంలో రహదారి మౌలిక వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్డు.. తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read Also: Bharateeyudu 2: భారతీయుడు సీక్వెల్‌ అవసరమా అనుకున్నా: శంకర్‌

కాగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓవైపు సమీక్షా సమావేశాలు.. మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.. మొదట పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన.. సమీక్ష నిర్వహించి.. పనుల పురుగతి తెలుసుకున్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టు కోసం విదేశీ నిపుణులను రంగంలోకి దించారు.. మరోవైపు.. రాజధాని ప్రాంతంలో పర్యటించి.. భవనాల నిర్మాణ పనులు ఎక్కడికి వచ్చాయన్నదానిపై సమీక్ష నిర్వహించి.. అమరావతి పనుల్లో కదలిక తెచ్చారు.. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి.. వరాల జల్లు కురిపించారు.. మరోవైపు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ల పంపిణీకి కూడా నిన్న మంగళగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన విషయం విదితమే.

Show comments