NTV Telugu Site icon

Chandrababau: ఏపీ విషయంలో కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోంది..

Chandrababu

Chandrababu

పోలవరంకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారానే చెబుతోందని తెలిపారు. కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోందని.. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పోలవరానికి రూ. 12,127 కోట్లను ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని.. పోలవరం పూర్తి అయితే దక్షిణాది రాష్ట్రాలకు తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని చంద్రబాబు తెలిపారు.

NTR: అభిమాని చనిపోయి11 ఏళ్లయినా.. కుటుంబానికి అండగా తారక్

2014-19 మధ్య కాలంలో పోలవరం పూర్తి చేయడానికి ప్రయత్నించామని ముఖ్యమంత్రి అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది.. పోలవరానికి శనిగ్రహం దాపురించిందని దుయ్యబట్టారు. పోలవరాన్ని గత ప్రభుత్వం అనాథగా మార్చేసిందని.. 15 నెలల పాటు పోలవరం వంటి ప్రాజెక్టు వైపు గత ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదని ఆరోపించారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. పోలవరం గైడ్ బండ్ కూడా కుంగిపోయిందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం రూ. 8 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇస్తే.. నాటి ప్రభుత్వం కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని అన్నారు. ఈ విషయంలో.. గత ప్రభుత్వానికి కేంద్రం రెండుసార్లు వార్నింగ్ కూడా ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఓ వ్యక్తి నిర్వాకం వల్ల రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందోననడానికి పోలవరమే అతి పెద్ద ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తామని కూటమి పార్టీలుగా తాము హామీ ఇచ్చామన్నారు. తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పని చేస్తున్నామని అన్నారు. పోలవరాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టగలిగాం.. పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలిగిందని సీఎం చెప్పారు. కేంద్రం ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. కేంద్రానికి అభినందనలు తెలిపారు.

Pushpa 2: 100 రోజుల్లో పుష్పగాడి రూలింగ్!

మరోవైపు.. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఉపాధి కల్పించడం, ఆర్థిక పరిస్థితి ట్రాక్ లో పెట్టడంలో కేంద్రం సహకరిస్తుందన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నగరాల అభివృద్ధికి కేంద్రం అనుమతించిందని.. కృష్ణపట్నం నోడ్ కూడా అనుమతి ఇచ్చారు. నక్కపల్లి ఫార్మా క్లస్టర్ కూడా వస్తోందని చంద్రబాబు చెప్పారు. కేంద్ర కేబినెట్ నిధులు ఇవ్వడానికి అంగీకరించడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇది కొంత వెసులుబాటు అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్ లు ఉన్నాయన్నారు. మొత్తం రూ. 28 వేల కోట్లు వీటిపై వ్యయం చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణం అవుతాయని..
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి మంచి రోజు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.