CM Chandrababu: దావోస్‌లో పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ఆయన వివరిస్తూ అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నేడు అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్సీ (Artificial Intelligence) సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో “ఫిజికల్ వర్చువల్ రియాలిటీ” (Physical Virtual Reality) కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ను ” ఒక వర్క్ ఫ్రం హోం హబ్” గా తయారు చేయాలని కోరిక ఉందంటూ తెలియజేశారు. ముఖ్యంగా చాలామంది మహిళలు చదువుకున్నవారు ఇంటి దగ్గర ఉన్నారని.. వారందరికీ ప్రతిరోజు కనీసం ఐదు లేదా ఆరు గంటలు సమయం ఉంటుందని.. ఆ సమయంలో వారు వారి తెలివితేటలు ఉపయోగించి 40-50 వేలు సంపాదించవచ్చని తెలియజేశారు. అలాగే కో వర్కింగ్ స్పేస్, జిసిసిని లాంటివాటిని నాలెడ్జ్ అకాడమీలోకి తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Saif Ali Khan Case: క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం సైఫ్ ఇంటికి నిందితుడు
అలాగే పెట్టుబడిదారులు ఒకవైపున, మరొకపక్కన కార్య నిర్వాహకులు సహకరిస్తే ఆ సమయంలో కంపెనీలకి అవసరమైన మ్యాన్ పవర్ ను ఫిజికల్ గా కానీ, వర్చువల్ గా కానీ రిక్రూట్ చేసి ముందుకు వెళ్దామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఇంటిలో వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అడాప్ట్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇదివరకు కేవలం ఐటీ గురించి మాట్లాడామని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఏదైనా సమస్య పరిష్కారం కోసం పది మందితో చర్చించే బదులు అవసరమైతే చాట్ జిపిటి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించండని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియల్ వినియోగం కోసం ప్రస్తుతం చాలావరకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని.. మరికొన్ని డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ముందు ముందు డబ్బులు వసూలు చేసే వాటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేదా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సభ్యత్వాన్ని అందించేలా చర్యలు చేపడతామని ఆయన సభ పూర్వకంగా తెలిపారు.