Chandrababu Meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన తొలి రోజు పర్యటనలో హస్తిన చేరుకోగానే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు… పలు కీలక అంశాలపై హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు తెలుస్తుంది.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కేంద్ర సహాయం కోరారు.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను జాప్యం చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరారు సీఎం.. నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు, నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.. ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలు కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు, విభజన చట్టంలోనూ పలు పెండింగ్ అంశాలను కూడా సత్వరమే పరిష్కరించాలని.. విభజన చట్టంను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖ దేనని ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది..
Read Also: Oil Tanker Capsized : ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా..13 మంది భారతీయులు గల్లంతు
ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం పై దృష్టిపెట్టారు.. అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో దాదాపు గంట పాటు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు కేంద్రం వెంటనే పరిష్కరించాలని అమిత్ షాను కోరినట్లు తెలుస్తుంది.. మరోపక్క హైదరాబాదులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన విషయాలను సైతం చంద్రబాబు నాయుడు అమిత్ షాకు వివరించినట్లు సమాచారం.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆర్థిక పరిస్థితులపై కూడా కేంద్ర హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు సమాచారం చర్చించినట్లు సమాచారం.. మరోపక్క పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని అమిత్ షాను చంద్రబాబు కోరినట్టు తెలుస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు నాయుడుకి ఇది రెండో ఢిల్లీ పర్యటన.. ముఖ్యంగా ఈనెల 22 నుంచి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి… ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరగాల్సిన కేటాయింపులపై మరోసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చంద్రబాబు నాయుడు ఈ టూర్ లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది..