Site icon NTV Telugu

CM Chandrababu: ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. వెలగపూడి నుండి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి అవకాశం ఉంది. విభజన సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అమిత్‌షాను కోరనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. రాత్రికి సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే బస చేయనున్నారు. చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. పదిహేను రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.

Read Also: AP Weather: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో వానలే వానలు

Exit mobile version