Site icon NTV Telugu

CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

Chandrababu

Chandrababu

CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు, బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది…మా రాష్ట్రం వృద్ధి చెందుతుంది అంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు.

Read Also: YS Jagan: జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి ట్విట్టర్ పోస్ట్‌లో.. “పెట్టుబడులు పెట్టేందుకు నేను పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నా. ఏపీలో వ్యాపార అనుకూల ప్రభుత్వం, ప్రతిభావంతులైన యువత, ఉత్తమ మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో చర్చించి కొత్త పాలసీలు తెచ్చింది. కొత్త పాలసీలు వేగవంతమైన వ్యాపార నిర్వహణకు దోహదం చేస్తాయి. మేము దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతారణ వ్యవస్థను నిర్మిస్తున్నాము. రాష్ట్రంలో మీ వ్యాపారానికి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాను. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ రాదు!. రాష్ట్రంలో పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది….రాష్ట్ర సామర్థ్యం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో మీ పెట్టుబడుల కోసం మేం ఎదురుచూస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version