CM Chandrababu: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్న ఆమె ‘పెట్టుకోండి సార్’ అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు. ఆ క్షణం ఉత్సాహానికి గురైన ఆమె జై బాబు అంటూ నినదించారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే వారితో ఫొటోలు దిగుతుండగా ఈ సన్నివేశం జరిగింది.
Read Also: Air India: గన్నవరం నుంచి ముంబైకి నూతన విమాన సర్వీస్ ప్రారంభం
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్కేడింగ్ చూసి పాత ప్రభుత్వ విధాన హ్యాoగ్ ఓవర్ వీడాలంటూ పోలీసులతో గట్టిగా చెప్పారు. ఇన్నేళ్లు కార్యకర్తల్ని కలుస్తూ వచ్చానని, ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని సీఎం ప్రశ్నించారు. పార్టీ శ్రేణులకు, తనకు అడ్డుగోడలు తెచ్చే చర్యలు ఉపేక్షించనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మీ భద్రతా సాయంతోనే పార్టీ కార్యాలయం నడపలేదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు. తనకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉంటానికి వీల్లేదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు.