NTV Telugu Site icon

CM Chandrababu: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 19న శ్వాసకోశ వ్యాధులతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సీతారాం ఏచూరి మృతితో.. అటు కమ్యూనిస్ట్ వర్గాల్లో, దేశ రాజకీయాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సీనియర్ సీపీఎం నేత సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Read Also: KCR: సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత సంతాపం..

భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో సీతారాం ఏచూరి ఒకరని చంద్రబాబు పేర్కొన్నారు. సమస్యలపై మేధోపరమైన అభిప్రాయాన్ని అట్టడుగు స్థాయిలో ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఏచూరి అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ఏచూరి స్పందించిన తీరు.. ఆయనకు పార్టీలకు అతీతంగా గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

సీతారాం ఏచూరి మృతి పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తమ సంతాపాన్ని తెలియజేశారు. సీపీఎం ప్రధానకార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి(72) అకాల మృతి కమ్యునిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాల్లో సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించారని.. వామపక్ష పార్టీల్లో కీలకనేతగా పేరుతెచ్చుకున్న సీతారాం ఏచూరి మరణం వామపక్షపార్టీల ఉద్యమాలకు తీరని లోటన్నారు. తుదిశ్వాస వరకు తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేసిన సీతారాం ఏచూరి మరణానికి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రకటించారు.

Show comments