NTV Telugu Site icon

CEO MK Meena: పిన్నెల్లి వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు: సీఈవో

Mk Meena

Mk Meena

AP CEO MK Meena Chit Chat: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలతో బృందాలు పని చేస్తున్నాయన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఏపీ సీఈవో ఎంకే మీనా మాట్లాడారు. మాచర్లలో టీడీపీ నేతల పర్యటన ఈ సమయంలో సరికాదని ఆయన వెల్లడించారు. అక్కడ ఇప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోందన్నారు.

Read Also: AP CEO MK Meena: ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి..

టీడీపీ నేతలు వెళ్తే వైసీపీ నేతలు వెళ్తామని అంటారని.. అప్పుడు మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. బయటి నాయకులు ఎవ్వరూ పరామర్శకు వెళ్లకూడదని.. ఎవ్వరినీ ఆ గ్రామాల్లోనికి వెళ్లనీయవద్దని ఇప్పటికే సూచించామన్నారు. ఈ సమయంలో పరామర్శలకు వెళ్లకూడదని సలహా ఇచ్చారు. పాల్వాయి పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు. పోలీస్ దర్యాప్తులో వీడియో ఎక్కడ, ఎవరి నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుందన్నారు. 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూంలను పరిశీలన చేస్తామన్నారు.