CEO MK Meena: పిన్నెల్లి వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు: సీఈవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CEO MK Meena Chit Chat: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలతో బృందాలు పని చేస్తున్నాయన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఏపీ సీఈవో ఎంకే మీనా మాట్లాడారు. మాచర్లలో టీడీపీ నేతల పర్యటన ఈ సమయంలో సరికాదని ఆయన వెల్లడించారు. అక్కడ ఇప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోందన్నారు.
Read Also: AP CEO MK Meena: ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి..
Also Read
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
టీడీపీ నేతలు వెళ్తే వైసీపీ నేతలు వెళ్తామని అంటారని.. అప్పుడు మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. బయటి నాయకులు ఎవ్వరూ పరామర్శకు వెళ్లకూడదని.. ఎవ్వరినీ ఆ గ్రామాల్లోనికి వెళ్లనీయవద్దని ఇప్పటికే సూచించామన్నారు. ఈ సమయంలో పరామర్శలకు వెళ్లకూడదని సలహా ఇచ్చారు. పాల్వాయి పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు. పోలీస్ దర్యాప్తులో వీడియో ఎక్కడ, ఎవరి నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుందన్నారు. 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూంలను పరిశీలన చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!